సిబ్బందిని (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 15
మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను సోంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలోనూ బైక్‌ల చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను సోంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలోనూ బైక్‌ల చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దొంగిలించిన వాహనాలను ఒడిశాలోని బరంపురంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టైన వారిని ఒడిశాకు చెందిన అద్దాలో సత్యనారాయణ ప్రధాన్ (32), అమిత్ సాహు (30)గా పోలీసులు గుర్తించారు.
వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి ఒకరి వద్ద 10, మరొకరి వద్ద 4 బైక్‌లు చొప్పున మొత్తం 14 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులు, జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ అభినందించారు.












