సంతమాగులూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 22
అద్దంకి మండలం శంకవరప్పాడు పరిధిలో పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం బాటిల్ లభించిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావును వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అద్దంకి మండలం శంకవరప్పాడు పరిధిలో పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం బాటిల్ లభించిన వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పలు దశల్లో విచారణ జరిపిన అనంతరం సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావును వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విచారణ వివరాలు
ఘటనపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టినట్లు తెలిసింది. పోలీసు విధుల్లో ఉపయోగిస్తున్న కారులో గత కేసులో స్వాధీనం చేసుకున్న గంజాయి ఉండటం, అలాగే కారులో మద్యం బాటిల్ ఉండటంపై ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
బదిలీకి కారణం
ఈ నేపథ్యంలో ఎస్సై నాగమల్లేశ్వరరావుపై వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. పోలీసు వాహనంలో అక్రమ సరుకులు లభించడం తీవ్రమైన అంశంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












