విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జార్జి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దేవ సహాయం, మండలం మాజీ వైస్ ఎంపీపీ మేరీ పుష్ప ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ అని వారు పేర్కొన్నారు.
జార్జి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దేవ సహాయం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని మండలం మాజీ వైస్ ఎంపీపీ మేరీ పుష్ప అన్నారు.
కనిగిరి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు
క్రౌన్ హ్యూమన్ రైట్స్ సంస్థ తరపున అమ్మవారి ఆశీస్సులతో కనిగిరి నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నిండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, శాంతి, సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ధర్మం గెలవాలి, అధర్మం ఓడాలి అని వారు అభిప్రాయపడ్డారు.
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రతి గుండెలో ఆశలు చిగురించాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ విజయదశమి పర్వదినం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ప్రజల కుటుంబాలపై ఉండాలని ఆకాంక్షించారు.












