విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ పాల్గొన్నారు. భద్రతా సిబ్బంది, పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆయుధ పూజ నిర్వహించి విజయదశమి పండుగను జరుపుకున్నారు.
విజయదశమి పర్వదదినాన్ని పురస్కరించుకుని చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ పాల్గొన్నారు. భద్రతా సిబ్బంది, పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆయుధ పూజ నిర్వహించి విజయదశమి పండుగను జరుపుకున్నారు.
మహేంద్ర నాథ్ సందేశం
ఈ సందర్భంగా మద్దులూరి మహేంద్ర నాథ్ మాట్లాడుతూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పర్వదినమని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరిలో ధైర్యం, ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు విజయదశమి స్ఫూర్తినివ్వాలని అన్నారు.
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో విజయదశమి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.












