బాపట్ల, 2 జూలై 2026
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పార్లమెంట్లో చట్ట సవరణకు కృషి చేయాలని కోరారు. గురువారం చీరాలలోని మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది.
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో చట్ట సవరణకు కృషి చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు.
గురువారం చీరాలలోని మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల విభజన నేపథ్యంలో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌కు, కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీకి పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. అలాగే మున్సిపాలిటీల్లో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయుల గత ఎయిడెడ్ సేవలను పరిగణనలోకి తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీతో పాటు డీఏ బకాయిలను వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ చీరాల నాయకులు వీ. ప్రభాకర్ రావు, ఎం. యేసు రత్నం, కట్టా సుబ్బారావు, జి.ఎన్. రాజ్‌కుమార్, జీవీ సుబ్బారెడ్డి, పేరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.










