Ranga Reddy/Basheerabad (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 17
ఏపీ జర్నలిస్టులపిల్లలకుప్రైవేటువిద్యాసంస్థలలోప్రకటించినఫీజురాయితీనిఇంటర్మీడియట్వరకువర్తింపచేయాలనిఆంధ్రప్రదేశ్జర్నలిస్టుఫోరంచీరాలనియోజకవర్గకమిటీప్రభుత్వాన్నికోరింది.స్థానికఆర్అండ్బిఅతిథిగృహంలోశుక్రవారంజరిగినజనరల్బాడీసమావేశంలోఈమేరకుతీర్మానించారు.
ప్రైవేటు విద్యాసంస్థలలో ప్రకటించిన ఫీజు రాయితీని జర్నలిస్టుల పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం చీరాల నియోజకవర్గ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం చీరాల నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఫోరం జిల్లా అధ్యక్షులు డి. విజయభాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ కే. ప్రభాకరరావు మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పి.శివ రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మహా టీవీ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షులు జి.కృష్ణాంజనేయులు సూచనల మేరకు చీరాల నియోజకవర్గ నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ కమిటీల ఎంపిక అనంతరం జిల్లా మహాసభను నిర్వహించనున్నట్లు తెలిపారు.
చీరాల నియోజకవర్గ ఫోరం నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా వంటరి నాగమణి బాబు (వార్త విలేకరి), దేవరపల్లి దిలీప్ (బిఆర్ కే న్యూస్) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా షేక్ బాషా (హెచ్ఎం టివి), సహాయ కార్యదర్శి, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ గా ఎన్. రమేష్ (మహా న్యూస్), కోశాధికారిగా గుమ్మడి సూర్యప్రకాష్ (సివిఆర్) ఎన్నికయ్యారు. మహమ్మద్ గని భాష, దగ్గుబాటి రాంబాబు (హెచ్.ఆర్. సి), వేటపాలెం నుండి ఎస్ రాజు(వార్త), దేవరపల్లి దిలీప్ (ఐ న్యూస్) కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కే. ఇజ్రాయిల్ కమిటీ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.










