రాయచోటి టౌన్‌లోని శ్రీచైతన్య స్కూల్ (4 బ్రాంచ్)లో రెండో తరగతి చదువుతున్న సమీహా (7) అనే విద్యార్థిని, నోట్ బుక్‌లో ఒక పదాన్ని తప్పుగా రాసినందుకు టీచర్ విశ్వదీప్ వాతలు వచ్చేలా కొట్టారని విద్యార్థి తల్లి పెద్దపుత్త నబియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సంబేపల్లె మండలం దేవ పట్లకు చెందిన విద్యార్థిని తల్లి, రాయచోటి అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం పాఠశాలకు వెళ్లిన తన కుమార్తె సమీహా సాయంత్రం ఇంటికి వచ్చి నీరసంగా కనిపించిందని, టీచర్ విశ్వదీప్ కొట్టారని తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. చిన్నారి ఒళ్లంతా మచ్చలు ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు.
విద్యార్థినిపై దాడి చేసిన టీచర్‌తో పాటు పాఠశాల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు.
ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతపై ఈ సంఘటన ఆందోళన కలిగిస్తోంది.


