** (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 18
'స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్' లక్ష్య సాధనలో భాగంగా, కలిదిండి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో శనివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బంది పూర్తిగా తొలగించి, ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

ఈ స్వచ్ఛత కార్యక్రమంలో కలిదిండి మార్కెట్ యార్డ్ చైర్మన్ కురాళ్ళ ఏడుకొండలు గారు మరియు మార్కెట్ యార్డ్ సెక్రటరీ ప్రసాద్ గారు స్వయంగా పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తూ, మార్కెట్ యార్డ్‌ను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాపారులు, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ సిబ్బంది, ఇతర కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు.