ఢిల్లీ / చీరాల, 2026-06-05
దేశవ్యాప్తంగా వార్తలు రాసే జర్నలిస్టులకు సుప్రీం కోర్ట్ ఒక కీలక తీర్పును వెలువరించింది. పెన్ను పట్టి, వీడియో కెమెరా పట్టి తమ దైనందిన వార్తలు, న్యూస్ ప్రసారాలు నిర్వహించే వారందరూ జర్నలిస్టులేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు, అవినీతిపరులపై నిజాలను నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై అక్రమ కేసులు చెల్లనేరవని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది.
దేశవ్యాప్తంగా వార్తలు రాసే జర్నలిస్టులకు సుప్రీం కోర్ట్ ఒక శుభవార్తను అందించింది. పెన్ను పట్టి, వీడియో కెమెరా పట్టి తమ దైనందిన వార్తలు, న్యూస్ ప్రసారాలు నిర్వహించే వారందరూ జర్నలిస్టులేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అక్రమ కేసులపై సుప్రీం కొరడా
ఇకపై రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాలు చేసేవారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలకు పాల్పడేవారి బాగోతాలపై నిజాలను నిర్భయంగా వార్త రాసిన, న్యూస్ ప్రసారాలు చేసిన జర్నలిస్టులపై అక్రమ కేసులు చెల్లనేరవని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. ఇలాంటి కేసులను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోదని పేర్కొంది.
జర్నలిస్టుల సంఘాలకే నిర్ణయాధికారం
శాటిలైట్ ఛానెల్స్, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు సంబంధించిన అక్రమ కేసులైనా, నిజ నిరూపణ కేసులైనా ఆయా సంఘాల ద్వారా పరిష్కారం కొరకు 7 రోజుల్లో నిర్ణయం తీసుకునే హక్కులు జర్నలిస్టుల సంఘాలకే ఉంటాయని సుప్రీం కోర్ట్ తెలిపింది. వారిని కాదని అక్రమ కేసులు పెట్టిన వారిపై, అట్టి పోలీసులపై వేటు తప్పదని హెచ్చరించింది.








