చిన్నగంజాం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 31
బటజకెకటజమడధోెజ,జమోజెషఇటెజ()కబధీ.ఓటజబఅధక.
చిన్నగంజాం మండల పరిధిలోని పెదగంజాం, చిన్నగంజాం గ్రామాల్లో జరుగుతున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విచారణ ప్రక్రియను బాపట్ల జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత బీఎల్ఓలతో మాట్లాడి, విచారణ ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
త్వరితగతిన పూర్తి చేయాలి
సర్ విచారణను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని బీఎల్ఓలకు కలెక్టర్ సూచించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించి, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అధికారుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డిఓ నరసింహారావు, తహసీల్దార్ జె. ప్రభాకరరావు, ఎంపీడీఓ ధనలక్ష్మి, మండల స్పెషల్ ఆఫీసర్‌తో పాటు సంబంధిత బీఎల్ఓలు పాల్గొన్నారు.












