శిక్షణ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 20
ప్రకాశం జిల్లాలో ఈ-సంజీవని టెలీమెడిసిన్ వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఈ-సంజీవని ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ తపన్ దాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా కలెక్టర్ పి. రాజాబాబును కలిశారు.
ప్రకాశం జిల్లాలో ఈ-సంజీవని టెలీమెడిసిన్ వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఈ-సంజీవని ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ తపన్ దాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన జిల్లా కలెక్టర్ పి. రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఈ-సంజీవని కార్యక్రమం అమలు తీరు, వైద్య సేవల నాణ్యత పెంపు, వైద్య సిబ్బందికి అందించనున్న ప్రత్యేక శిక్షణ తదితర అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఒంగోలులోని బ్రిలియన్స్ కంప్యూటర్స్‌లో వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డాక్టర్ తపన్ దాస్ వెల్లడించారు. శిక్షణకు సంబంధించిన షెడ్యూల్‌ను జిల్లాలోని వైద్యాధికారులందరికీ ముందుగానే తెలియజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నిపుణులైన వైద్యుల సలహాలు, సూచనలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ-సంజీవని సేవలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక శిక్షణ ద్వారా వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలకు మరింత అవగాహన, సాంకేతిక నైపుణ్యం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు మరింత నాణ్యంగా, సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.







