తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది.
బస్సు నెమ్మదిగా వస్తోందని భావించి రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన సమయంలోనే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనలో మృత్యువు ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.











