నంద్యాల, 2026-11-28
పార్లమెంట్ లో రాబోయే డీలిమిటేషన్ బిల్లుతో పాటు బీసీలకు చట్టసభలలో 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బీసీల జనాభాకు తగ్గట్టుగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే 137వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే విద్యకు, సమాజానికి, సమానత్వానికి చేసిన సేవలను కొనియాడారు.
సమాజంలో అణగారిన వర్గాలకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు విద్య అందించడంలో ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. 1848లో భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి, స్త్రీ విద్యకు పునాది వేసిన మహనీయుడని, కుల వివక్ష, అంటరానితనం, అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్తగా కొనియాడారు.
సత్యశోధక్ సమాజ్ స్థాపించి సామాజిక న్యాయం, సమానత్వం, మానవ గౌరవం కోసం జీవితాంతం పోరాడారని, ఆయన ఆశయాలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఫూలే ఆశయ సాధన కోసమే బీసీలకు చట్టసభలలో సరైన రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ పెరుగు శివకృష్ణ యాదవ్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు బిజినవేముల శ్రీనివాసులు, మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోయ పులికొండన్న, సంఘం నాయకులు నందవరం శ్రీనివాసులు, కుమ్మరి సంక్షేమ సంఘం పట్నం రాముడు, జంగం సంఘం నందులమరము చంద్రశేఖర్, ఉప్పరి సంఘం మాజీ కౌన్సిలర్ మధుసాయి, మనోజు, వెంకటేశ్వర్లు రాధాకృష్ణ, బొగ్గులైన్ ఓబులేసు, వడ్డే సంక్షేమ సంఘం చల్ల వెంకటేష్, న్యాయవాది అబ్దుల్ కాదర్, న్యాయవాది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.







