క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-22
అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి నారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కూటమి చైర్మన్ అభ్యర్థి తోటకూర సునీల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి నారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అల్లూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతి వార్డులో స్వయంగా ప్రచారం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తానే స్వయంగా ప్రతి వార్డులో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తానని స్పష్టం చేశారు. అల్లూరు అభివృద్ధికి ఇప్పటికే 47 కోట్ల నిధులు మంజూరు చేశామని, 2028 నాటికి నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు, పాఠశాలలు వంటి సకల మౌలిక సదుపాయాలతో నెల్లూరుతో సమానంగా అల్లూరును కూడా సమగ్రాభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.
అభివృద్ధి పనుల పర్యవేక్షణ
అంతేకాకుండా నెలకు ఒకసారి కచ్చితంగా అల్లూరుకు వచ్చి పనులను పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చిన మంత్రి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి అభ్యర్థిని చారిత్రాత్మక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.







