నంద్యాల, 2026-11-22
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానందిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం (24.11.2026) కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆలయ చైర్మన్ నరాల చంద్రమౌళిరెడ్డి, కార్యనిర్వహణాధికారి () ఎన్. శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఈ ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి.
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం మహానందిలో మంగళవారం (24.11.2026) కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆలయ చైర్మన్ నరాల చంద్రమౌళిరెడ్డి, కార్యనిర్వహణాధికారి () ఎన్. శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఈ ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి.
సాయంత్రం 6:30 గంటలకు ఆలయ రాజగోపురం ఎదురుగా శాస్త్రోక్తంగా జ్వాలా తోరణం కార్యక్రమాన్ని వెలిగిస్తారు. జ్వాలా తోరణం అనంతరం వేలాది మంది భక్తులు, దంపతుల సమక్షంలో కన్నుల పండువగా కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు.
దంపతులకు ప్రత్యేక అవకాశం
ఈ మహా క్రతువులో దాదాపు వెయ్యి మంది దంపతులు నేరుగా కూర్చుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకునేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు కల్పించింది.
కావున నంద్యాల జిల్లా మరియు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, ఈ వేడుకల్లో పాల్గొని శ్రీ మహానందీశ్వర స్వామివారి మరియు కార్తీక దామోదరుని కృపకు పాత్రులు కావాలని ఆలయ చైర్మన్ నరాల చంద్రమౌళిరెడ్డి, ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో కోరారు.







