కొరిసపాడు, 2026-11-21
మొక్కలను నాటడంతో పాటు వాటిని బాధ్యతగా సంరక్షించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని సెయింట్ ఆర్నాల్డ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఫాదర్ టీ. థామస్ రెడ్డి అన్నారు. కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని సెయింట్ ఆర్నాల్డ్స్ హైస్కూల్లో ఒంగోలు రేంజ్ అటవీ శాఖ, సెయింట్ ఆర్నాల్డ్స్ హైస్కూల్, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డిబిఆర్సీ) సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
మొక్కలను నాటడంతో పాటు వాటిని బాధ్యతగా సంరక్షించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని సెయింట్ ఆర్నాల్డ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఫాదర్ టీ. థామస్ రెడ్డి అన్నారు. కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని సెయింట్ ఆర్నాల్డ్స్ హైస్కూల్లో ఒంగోలు రేంజ్ అటవీ శాఖ, సెయింట్ ఆర్నాల్డ్స్ హైస్కూల్, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డిబిఆర్సీ) ప్రకాశం జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు రేంజ్ అటవీ శాఖ సామాజిక అటవీ నర్సరీల ద్వారా అందించిన వివిధ రకాల మొక్కలను విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫాదర్ టీ. థామస్ రెడ్డి మాట్లాడుతూ, మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దానిని పెంచి పెద్ద చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులకు పిలుపు
డిబిఆర్సీ జిల్లా కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ, అటవీ శాఖ అందిస్తున్న మొక్కలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇళ్ల పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటికి క్రమం తప్పకుండా నీరు పోస్తూ, పశువుల బారి నుంచి రక్షిస్తూ సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఒక్క కుటుంబం ఒక్క మొక్క, ప్రతి మొక్కకు సంరక్షణ అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం మురసు తుఫాను కారణంగా పాఠశాల ప్రాంగణంలో విరిగిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటారు.
కార్యక్రమ వివరాలు
ఈ కార్యక్రమంలో ఫాదర్ గైక్వాడ్ పీటర్, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.







