టంగుటూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 21
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టంగుటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి బెల్లం జయంత్ బాబు, 20వ వార్డు బాపూజీ కాలనీ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న బొమ్మెల మునీంద్ర బాపూజీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టంగుటూరు మండలంలోని బాపూజీ కాలనీ 20వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బెల్లం జయంత్ బాబుకు కేటాయించిన కత్తెర గుర్తుపై, 20వ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న బొమ్మెల మునీంద్రకు కేటాయించిన స్టూలు గుర్తుపై జరిగే ఎన్నికల్లో ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమకు అవకాశం కల్పించాలని వారు ప్రచారం ద్వారా ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.







