చిలకలూరిపేట పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదహళ్లి జగదీశ్ ఆదేశాల మేరకు అర్బన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో ప్రమాదకర ప్రాంతాల్లో జిగ్‌జాగ్ బ్యారికేడింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సరైన లైటింగ్, బ్యారికేడింగ్ వంటి ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
చిలకలూరిపేట పట్టణంలోని బ్లాక్స్పాట్లు, హాట్స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ ఆదహళ్లి జగదీశ్ ఆదేశాల మేరకు అర్బన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో జిగ్‌జాగ్ బ్యారికేడింగ్‌ను ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించి, దశలవారీగా సరైన లైటింగ్, బ్యారికేడింగ్, టీఎంబీలు తదితర ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండడంతో పాటు కార్లలో సీట్‌బెల్ట్ ధరించాలని కోరారు. నియంత్రిత వేగంతో వాహనాలు నడపడం, పోలీసులకు ప్రజలు సహకరించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.












