మార్టూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 07
మండలంలోని రాజుపాలెం స్టేజి వద్ద భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అదనపు జనరల్ సెక్రటరీ స్వయంగా రంగంలోకి దిగారు.
5 కి.మీ మేర నిలిచిపోయిన ట్రాఫిక్ మార్టూరు లోని రాజుపాలెం స్టేజి వద్ద భారీగా ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పరిస్థితిని గమనించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అదనపు జనరల్ సెక్రటరీ స్వయంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో కలిసి రోడ్డుపైకి వెళ్లి వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేయడంలో కీలకంగా సహకరించారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలకు మార్గం సుగమం చేసేందుకు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టారు. అత్యవసర వాహనాలు, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్‌ను వీలైనంత త్వరగా క్లియర్ చేయడంపై దృష్టి పెట్టారు.ప్రజలకు ఇబ్బంది కలిగిన సమయంలో కేవలం సమస్యను ప్రశ్నించడమే కాకుండా.. పరిష్కారంలో భాగస్వామిగా నిలిచిన హ్యూమన్ రైట్స్ ప్రతినిధి చర్యకు పలువురు అభినందనలు తెలిపారు.


