మండలం, కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో చిరులమల ఫ్రాన్సిస్ చైర్మన్గా, గోగులమూడి సుమతి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కారంచేడు మండలం, కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో చిరులమల ఫ్రాన్సిస్ చైర్మన్గా, గోగులమూడి సుమతి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీకి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అభినందనలు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి విద్యా కమిటీలు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాన్ని స్టేషన్ హౌస్ అధికారి మరియు ప్రధానోపాధ్యాయులు ఏ ఉమా మహేశ్వరరావు పర్యవేక్షించారు.












