లక్ష్యంగా (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
గుంటూరు జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పాత గుంటూరు పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో లిక్విడ్ గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పాత గుంటూరు పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి లిక్విడ్ గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ టి. సీతారాం పర్యవేక్షణలో పాత గుంటూరు సీఐ వెంకట ప్రసాద్ తన సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి సాయంత్రం 5 గంటలకు పాత గుంటూరు, బాలాజీ నగర్ 1వ లైన్‌లోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్‌పై దాడి చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న 440 గ్రాముల లిక్విడ్ గంజాయి కలిగిన 44 ప్లాస్టిక్ టిన్నులు, నాలుగు కూల్ డ్రింక్ పెట్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ () చట్టం కింద కేసు నమోదు చేశారు.
కారుమూరి సన్నీ డేనియల్ (రావిపాడు), కొక్కు శ్యామ్ సుందర్ (బోయపాలెం), బండి వంశీకృష్ణ (సీతారాపురం), షేక్ ఫణీంద్ర (ఉన్నవ), తన్నీరు ప్రదీప్ (చిలకలూరిపేట), అల్లాబకాష్ ఓవైస్ రజా (తాడిపత్రి), తాళ్లపురెడ్డి హరినాథ్ రెడ్డి (జమ్మలమడుగు), గడ్డం గంగాధర్ (గుంటూరు) ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన జమీర్, పాంగి అనే మరో ఇద్దరు నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఈస్ట్ డీఎస్పీ టి. సీతారాం మాట్లాడుతూ, సబ్ డివిజన్ పరిధిలో గంజాయిని కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు, ఈగల్ () టీమ్ సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచామని, గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


