వలేటివారిపాలెం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
కందుకూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కందుకూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కందుకూరు పట్టణంలోని 40వ వార్డుకు చెందిన పది కుటుంబాల వారు ఆదివారం శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక వార్డు నాయకులు ముప్పవరపు వేణు, మాదాల నరసింగరావు, వీరా వెంకట్రావు, ముప్పవరపు కృష్ణారావు మరియు కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిల్లి నారాయణ, పిల్లి శ్రీనివాస్, పిల్లి ప్రసాదు, వీరా ఆదిలక్ష్మి సహా పది కుటుంబాల సభ్యులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వారు పార్టీలో చేరినట్లు టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి.
మరోవైపు, మండలం అయ్యవారిపల్లి పంచాయతీలోని రామలింగాపురం గ్రామానికి చెందిన సింగమనేని నరసింహం, బాసం శివ ఆదివారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును కలిశారు. శనివారం నాడు వైసీపీ నేతలు తమను పిలిపించి బలవంతంగా వైసీపీ కండువాలు కప్పారని వారు ఎమ్మెల్యే వద్ద ఆరోపించారు. తాము ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతామని, తమ రాజకీయ ప్రయాణం టీడీపీతోనేనని సింగమనేని నరసింహం, బాసం శివ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆశీస్సులతో బరిలో నిలిచే అభ్యర్థి విజయానికి తాము పూర్తిస్థాయిలో కృషి చేస్తామని వారు పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోరుకొండ అంజిబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు సోమరాజు, మాజీ సర్పంచ్ కూడలి భాస్కర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.





