బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
దగ్గుబాడు నుంచి స్వర్ణ వైపు వస్తున్న ఆటో, స్వర్ణ నుంచి దగ్గుబాటి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంలో వాహనాల రాకపోకలు కొంతసేపు స్తంభించాయి.








