చీరాల, 2026-11-22
బాపట్ల జిల్లా చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ కూటమి అభ్యర్థిగా గవిని నారాయణ ఎన్నికల బరిలో నిలిచారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ కూటమి అభ్యర్థిగా గవిని నారాయణ ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామంలో పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రజలను కలుస్తూ గ్రామాభివృద్ధికి సంబంధించిన తన ప్రణాళికలను వివరిస్తున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని అంతర్గత రహదారుల అభివృద్ధి, మురుగునీటి పారుదల సౌకర్యం, ప్రతి ఇంటికీ మెరుగైన మంచినీటి సరఫరా కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే తన ప్రధాన లక్ష్యమని గవిని నారాయణ వెల్లడించారు.
ప్రజల అవసరాలను తెలుసుకుంటూ గ్రామాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తానని, ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే గ్రామ సంక్షేమానికి అంకితభావంతో కృషి చేస్తానని ఆయన తెలిపారు.







