బాపట్ల, 13 September
క్యాన్సర్ చికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న ఆటో చిలకలూరిపేట సమీపంలోని పోలిరెడ్డిపాలెం బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

ఒంగోలు సమీపంలోని ఈతముక్కలకు చెందిన వూట్ల రాజేశ్వరి (24) క్యాన్సర్ చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది.
ఆటో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో రాజేశ్వరి భర్త అశోక్ (32) ఆటోను నడుపుతున్నట్లు సమాచారం. పోలిరెడ్డిపాలెం వద్ద బైపాస్, సర్వీస్ రోడ్డు మార్గాల మధ్య గందరగోళానికి గురైన అశోక్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో మర్రిపూడి సుశీల (52) తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌తో పాటు అశోక్, రాజేశ్వరిలకు కూడా గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు వెంటనే స్పందించి, సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.