అమరావతి, 2026-06-05
కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఇందిరాదేవితో పాటు మరో 10 మంది ఉద్యోగులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

విచారణ ఎదుర్కొంటున్న సిబ్బంది
సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఇందిరాదేవి, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి.ఎం.వేణుగోపాల్, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు డాక్టర్ డి.యాదయ్య, డాక్టర్ కె.వి.ఎస్.సత్యనారాయణ, డాక్టర్ సీహెచ్.రాజ్‌కుమార్, డాక్టర్ గట్టం లీనా, డాక్టర్ టి.సూదేశకుమార్, ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 బి.విజయకుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్.నరసింహారావు, హెడ్నర్స్ సీహెచ్.విజయకుమారి, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎన్.పద్మజపై ఈ విచారణ జరగనుంది.
విచారణాధికారి నియామకం
ఈ విచారణకు ప్రకాశం జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.వి.లక్ష్మీకుమారిని విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సూచించింది. ఏసీబీ ఇన్స్పెక్టర్ జి.వి.వి.సత్యనారాయణను ఈ విచారణకు ప్రెజెంటింగ్ అధికారిగా నియమించారు.