ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.కళ్యాణ్ మరియు గోపినాయక్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
వారు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, యం.వి.యాక్ట్ సవరణ చట్టం రద్దు చేయాలని, అలాగే జీవో నెంబర్ 21 ద్వారా విధించే భారీ పెనాల్టీలు రద్దు చేయాలని సూచించారు.
అటు, విదేశీ ప్రైవేటు కంపెనీల అనుమతులను రద్దు చేయాలని, కేరళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉచిత యాప్ ఏర్పాటు చేసినట్లు, తమ రాష్ట్రంలో కూడా అలాంటి చర్యలు చేపట్టాలని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు కరీం, మస్తాన్, శివ, మౌలాలి, లక్ష్మణ్, శ్రీను మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.


