ఏలూరు, July 14
ఏూరు జిా, కిదిండి మండ మారకట యారడ నూతన చైరమనగా కూరళళ ఏడుకొండు బాధయతు సీకరించారు. సథానిక ఎమమయే, పరజా పరతినిధు సహకారంతో మారకట యారడ అభిృదధికి కృషి చేసతానని, రైతు బజార పరారంభం, ఉచిత పశు ైదయ శిబిరాు ఏరపాటు ంటి పు అభిృదధి కారయకరమాను అము చేసతానని ఆయన తిపారు.
ఏలూరు జిల్లా, కలిదిండి మండల మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా కూరెళ్ళ ఏడుకొండలు బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధుల సహకారంతో ముందుకు సాగుతానని, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో రైతు బజార్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ వెల్లడించారు. పశువులకు ఉచిత వైద్య శిబిరాలు, క్యాంపులు ఏర్పాటు చేసి, మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్ ద్వారా వస్తున్న ఆదాయం 5 కోట్లుగా పేర్కొంటూ, రాబోయే కాలంలో దీనిని మరింత అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని వివరించారు.
కలిదిండిని ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, కాంప్లెక్స్ నిర్మాణం, వెయింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు, పాతబడ్డ రోడ్లు, షెడ్ల పునరుద్ధరణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చైర్మన్ ఏడుకొండలు తెలిపారు.












