బాపట్ల, 2026-07-08
చమండఎంపడఓగొండపిఘోమంించ.గంోఈథనంోపనిచేినటి..పూనదేిపదిమచేడంోఏపడినఖళనిభచేూపశంజిజడ.పి.మఖనిహిిి.చింజిఉజచేశ.
చీరాల మండల ఎంపీడీఓ గా కొండపి రఘుబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో చీరాల మండల ఎంపీడీఓ గా విధులు నిర్వహించిన టి.యల్. ప్రసూనాదేవి జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లా జడ్.పి. ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి. చిరంజీవి జులై 1న ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల డిప్యూటీ ఎంపీడీఓ గా పనిచేస్తూ పదోన్నతి పొందిన కొండపి రఘుబాబును చీరాల మండల రెగ్యులర్ ఎంపీడీఓ గా నియమిస్తూ ఆ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు కొండపి రఘుబాబు జులై 8న బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, మండలంలోని సచివాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓ కొండపి రఘుబాబును కలిసి అభినందనలు తెలియజేశారు.








