న్యూఢిల్లీ, 3 July
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) సంస్థ, సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సేవలందిస్తున్న శ్రీ అట్లూరి బాలశేఖర్ గారికి ఉన్నత పదోన్నతి కల్పించింది. వారి సేవలను గుర్తించి "సౌత్ ఇండియా జనరల్ బాడీ కమిటీ అబ్జర్వర్" గా నియమించింది.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సభ్యులుగా సేవలందిస్తున్న శ్రీ అట్లూరి బాలశేఖర్ గారికి సంస్థ ఉన్నత పదోన్నతి (Promotion) కల్పించింది.
శ్రీ అట్లూరి బాలశేఖర్ గారు గత కొంతకాలంగా సంస్థ బలోపేతానికి, మానవ హక్కుల పరిరక్షణకు అందిస్తున్న విశేష సేవలను, వారి నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని జాతీయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. వారి పనితీరును గుర్తిస్తూ, ప్రస్తుత బాధ్యతల నుండి వారికి ప్రమోషన్ కల్పిస్తూ "సౌత్ ఇండియా జనరల్ బాడీ కమిటీ అబ్జర్వర్" (South India General Body Committee Observer) గా నియమించడం జరిగింది.
ఇకపై వారు దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కమిటీల సమన్వయకర్తగా, పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కమిటీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు సాధారణ సభ్యులు ఈ మార్పును గమనించవలసిందిగా కోరుచున్నాము. అందరూ నూతన అబ్జర్వర్ గారికి పూర్తి సహకారం అందిస్తూ, సంస్థ ఆశయాల సాధనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
సంస్థ బలోపేతానికి బాలశేఖర్ గారు మరింతగా తోడ్పడతారని, వారి నాయకత్వంలో దక్షిణ భారత కమిటీలు మరిన్ని విజయవంతమైన కార్యక్రమాలు చేపడతాయని ఆశిస్తూ, జాతీయ కమిటీ తరపున వారికి హృదయపూర్వక అభినందనలు.
ఈ విషయాన్ని ఎల్. ముత్యాల బాబు, నేషనల్ జనరల్ సెక్రటరీ, క్రమశిక్షణ కమిటీ మెంబర్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) పత్రికా ముఖంగా తెలియజేశారు.











