ఫిరంగిపురం, 2026-11-20
బంగారు ఆభరణాల తయారీదారుడైన అమిత్ మాజి అనే వ్యక్తి వద్ద నుంచి బంగారం, నగదును అపహరించిన కేసులో మహంకాళి, షేక్ ఆశీర్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 40 గ్రాముల బంగారం, రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
బంగారు ఆభరణాల తయారీదారుడైన అమిత్ మాజి అనే వ్యక్తి వద్ద నుంచి బంగారం, నగదును అపహరించిన కేసులో మహంకాళి, షేక్ ఆశీర్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 6వ తేదీన అమిత్ మాజి అనే వ్యక్తి బంగారంతో గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్లేందుకు గుంటూరులో వేచి ఉండగా, నరసరావుపేట వెళ్తున్నామని చెప్పిన నిందితులు కారులో లిఫ్ట్ ఇచ్చారని సీఐ భుజంగరావు తెలిపారు. మార్గమధ్యలో ఫిరంగిపురం మండలం వేమవరం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపి, బాధితుడి వద్ద ఉన్న రూ.4,500 నగదుతో పాటు 40 గ్రాముల బంగారాన్ని అపహరించి పరారయ్యారని వివరించారు.
దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు గుంటూరు మార్కెట్ యార్డులోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, కారు ఆధారంగా నిందితులను గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని అపహరించిన బంగారాన్ని రికవరీ చేశారు.
నిందితులను పట్టుకోవడంలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించారని సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కేసు ఛేదనలో సీఐ భుజంగరావుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



