ఏలూరు, 21/07/2026
ఏలూరు జిల్లా, మండవల్లి మండలం పరిధిలోని ఇంగిలిపాకలంక, నందిగామలంక, పెనుమాకలంక గ్రామాలకు రూ. 7.7 కోట్ల నిధులతో 3.5 కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రారంభోత్సవంతో మూడు గ్రామాల ప్రజల చిరకాల కల నెరవేరింది.
ఏలూరు జిల్లా, మండవల్లి మండలం పరిధిలోని ఇంగిలిపాకలంక, నందిగామలంక, పెనుమాకలంక గ్రామ వాసుల చిరకాల కల నెరవేరింది. ఈ మూడు గ్రామాలను కలిపే ప్రధాన రహదారిని శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే డా. కామినేని గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు ఈరోజు మండవల్లి మండలంలోని ఇంగిలిపాకలంక, నందిగామలంక, పెనుమాకలంక గ్రామాలలో 3.5 కిలోమీటర్ల మేర రూ. 7.7 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, కొల్లేరు లంక గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నామని, ఎన్నో ఏళ్లుగా లంక గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్న రవాణా సమస్యకు నేడు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని అన్నారు. గతంలో గుంతలమయంగా ఉండి, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు కలిగించిన ఈ రోడ్డు స్థానంలో సరికొత్త బీటీ రోడ్డును ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఈ రోడ్డు కేవలం మట్టి, తారుతో వేసిన మార్గం మాత్రమే కాదని, ఇది గ్రామాల అభివృద్ధిని, పిల్లల భవిష్యత్తుకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని తెచ్చే బంగారు బాట అని అభివర్ణించారు. గతంలో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా, పంటలను మార్కెట్లకు చేరవేయాలన్నా ప్రజలు పడిన కష్టాలు అందరికీ తెలుసునని, ఎన్నో ఏళ్ల ఈ నిరంతర పోరాటం ప్రజాప్రతినిధుల సహకారం, గ్రామస్తుల ఐక్యతతో నేడు ఈ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. ఈ రోడ్డును మనందరి ఆస్తిగా భావించి, దీనిని సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.











