చీరాల, 2026-11-28
చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు అభ్యర్థులు తమదైన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక నాయకుల మద్దతు ఒకరికి, రాజకీయ పార్టీల అండ మరొకరికి ఉంది. అనుభవం, సేవా కార్యక్రమాలు, రాజకీయ బలాబలాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
కొత్తపేటలో స్థానికుడా లేక స్థానికేతరుడా అనుభవం, సేవా కార్యక్రమాలు, రాజకీయ బలాబలాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఓటరు నాడిని అంచనా వేయలేని సర్వేలు, తుది తీర్పు ఎవరికి అనుకూలిస్తుంది డబ్బు ప్రభావం ఉంటుందా ప్రజాసేవకు పట్టం కడతారా లేదా అన్నది ఆసక్తికరం. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు అభ్యర్థులు తమదైన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
స్థానిక నాయకుల మద్దతు ఒకరికి, రాజకీయ పార్టీల అండ మరొకరికి ఉంది. మరొకరు గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవాన్ని నమ్ముకుంటున్నారు. మరికొందరు విద్యార్హతలు, సామాజిక సేవా కార్యక్రమాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. దీంతో కొత్తపేట ఎన్నికల పోరు సాధారణ పంచాయతీ ఎన్నికలను తలపించకుండా రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది.
అనుభవమే అస్త్రంగా స్వతంత్ర అభ్యర్థి వాసు
మాజీ ఎంపీటీసీ సభ్యుడిగా, గతంలో సర్పంచ్‌గా పనిచేసిన చుండూరు వాసు తన రాజకీయ, పరిపాలనా అనుభవాన్ని ప్రధాన బలంగా భావిస్తున్నారు. గ్రామ సమస్యలు, ప్రజల అవసరాలు, పంచాయతీ పాలనపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన వర్గీయులు అంటున్నారు. గత 13 ఏళ్లుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగని పరిస్థితుల్లోనూ వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నానని ఆయన చెబుతున్నారు. గత అనుభవం, గ్రామ ప్రజలతో ఉన్న పరిచయాలు ఓట్ల రూపంలో తనకు మద్దతుగా మారుతాయని వాసు ఆశిస్తున్నారు.
సేవా కార్యక్రమాలే బలంగా బీజేపీ అభ్యర్థి దేవరాజు
బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తాడివలస దేవరాజు యువత, సామాజిక సేవా కార్యక్రమాలపై ఆశలు పెట్టుకున్నారు. చీరాల, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో వైద్య సేవలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థానికంగా గుర్తింపు పొందినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలోకి దిగిన దేవరాజు పార్టీ మద్దతుతో తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
విద్యార్హతలు, సేవా దృక్పథంతో రామ్మూర్తి
గునుకుల రామ్మూర్తి కూడా ఎన్నికల బరిలో తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బీటెక్, ఎల్ఎల్బీ విద్యార్హతలు కలిగిన ఆయన, మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్నారు. గ్రామంలో నివాసం ఉండటంతో పాటు స్థానిక ప్రజలతో సన్నిహిత సంబంధాలు, గ్రామ సమస్యలపై అవగాహన తనకు కలిసివస్తాయని ఆయన వర్గీయులు విశ్వసిస్తున్నారు. విద్యావంతుడైన నాయకత్వానికి, అభివృద్ధిపై స్పష్టమైన ఆలోచనలకు ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.







