ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు () 2025 నియామక ప్రక్రియకు సంబంధించిన కానిస్టేబుల్ తుది ఎంపిక ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో మెరిట్ జాబితాను పరిశీలించి, తమ ఎంపిక స్థితిని తెలుసుకోవచ్చు. వివిధ కేటగిరీలకు సంబంధించిన కటాఫ్ వివరాలు కూడా అందుబాటులో ఉంచారు.
ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. ఈ నియామక ప్రక్రియలో సివిల్ పోలీస్, పీఏసీ/సాయుధ పోలీస్, ప్రత్యేక భద్రతా దళం, జైలు వార్డర్, గుర్రపు పోలీస్, మహిళా బెటాలియన్ పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ పోస్టుకు సంబంధించిన జాబితాను మాత్రమే తెరిచి, అందులో పేరు లేదా రోల్ నంబర్ ఆధారంగా ఫలితాన్ని తనిఖీ చేసుకోవాలి.
ఫలితాలు తనిఖీ చేసే విధానం
1. ముందుగా యూపీ పోలీస్ నియామక బోర్డు అధికారిక వెబ్సైట్ .. ను సందర్శించాలి. 2. తాజా ప్రకటనల్లో కానిస్టేబుల్ తుది ఎంపిక ఫలితానికి సంబంధించిన లింక్ను ఎంచుకోవాలి. 3. మీ పోస్టుకు సంబంధించిన మెరిట్ జాబితా ను తెరవాలి. 4. అందులో మీ పేరు లేదా రోల్ నంబర్ను వెతికి ఎంపిక స్థితిని తెలుసుకోవాలి. 5. భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాల ను డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.
మెరిట్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు తదుపరి నియామక ప్రక్రియకు సంబంధించి బోర్డు విడుదల చేసే అధికారిక సూచనలను పరిశీలించాలి. కటాఫ్ మార్కులు, ఎంపిక వివరాలు, తదుపరి చర్యల విషయంలో అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా తీసుకోవాలి.












