Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 07
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే దుష్పరిణామాలపై కారంచేడు పోలీసులు, న్యాయస్థానం ప్రజలను అప్రమత్తం చేశాయి. కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఇద్దరికి కోర్టు రూ.10,000 చొప్పున జరిమానా విధించింది.
మధ్యం సేవించి వాహనం నడిపితే పదివేల రూపాయలు ఫైన్ తస్మాత్ జాగ్రత్త కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులపై, కారంచేడు పోలీసు వారు కేసులు నమోదు చేసి, గౌరవ పర్చూరు కోర్టు వారు ముందు హాజరుపరచగా, గౌరవ కోర్టు వారు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున జరిమానా విధించడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు వారు మరియు కారంచేడు SI గారు మధ్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రమాదాలకు గురి కావద్దని, జీవితాన్ని పణంగా పెట్టవద్దని హెచ్చరించారు. మరియు మధ్యం సేవించడం వలన జీవితాలు ఛిద్రమై పోతాయని. మధ్యం సేవించడానికి పెట్టే డబ్బులతో కుటుంబాన్ని బాగు చేసుకుని, అందరు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మరియు మరోమారు మధ్యం సేవించి దొరికేతే పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.


