Markapur, Prakasam, Andhra Pradesh (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 04
మార్కాపురం విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజినీర్‌గా గత ఐదేళ్లుగా సేవలందించిన ఆర్. అశోక్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందారు. ఆయన మార్కాపురం డివిజన్ కార్యాలయంలో నూతన బాధ్యతలు స్వీకరించారు.
*మార్కాపురం ఈఈగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. అశోక్ కుమార్* విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో గత ఐదేళ్లుగా డిప్యూటీ ఇంజినీర్‌గా సమర్థవంతమైన సేవలందించిన ఆర్. అశోక్ కుమార్ పదోన్నతి పొందారు. విధి నిర్వహణలో ప్రజలతో, సహచర సిబ్బందితో సత్సంబంధాలు కలిగి ఉండి అందరికీ సుపరిచితులైన ఆయన, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా పదోన్నతి పొంది మార్కాపురం డివిజన్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు











