నార్పల, 2026-11-29
నార్పల మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నార్పల మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎస్ఐ సాగర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఎనిమిది మంది ఎస్ఐలు, 230 మందికి పైగా పోలీసు సిబ్బందితో విస్తృత బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నార్పల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
కౌంటింగ్ ప్రక్రియ సైతం ప్రశాంతంగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో 144, 163 సెక్షన్లు అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ సాగర్ సూచించారు. నిర్ణీత దూరం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ సాగర్ తెలిపారు.







