కోట, 2026-11-23
చెందోడు గ్రామంలోని ఎం.వి. రావు ఫౌండేషన్ కార్యాలయంలో నిరుపేదలకు వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు.
విద్యా ప్రదాత, విశ్రాంత అధ్యాపకులు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారి 19వ వర్ధంతిని పురస్కరించుకుని, కోట మండలం చెందోడు గ్రామంలోని ఎం.వి. రావు ఫౌండేషన్ కార్యాలయంలో సోమవారం నిరుపేదలకు వస్త్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారి మరణించిన రోజును గుర్తు చేసుకుంటూ, ఆయన మధుర స్మృతులకు చిహ్నంగా సోమవారం చెందోడు గ్రామంలోని నిరాశ్రయులకు, నిరుపేదలకు ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామహల్ కృష్ణ వస్త్రదానం చేశారు.
ఈ సందర్భంగా లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ, అన్ని దానాల్లోకెల్లా వస్త్రదానం గొప్పదని, స్వర్గీయ వెంకటేశ్వరరావు గారు మరణించిన కార్తీక సోమవారం సందర్భంగా తాము ఈ వస్త్రదానాన్ని పేదలకు అందజేశామని తెలిపారు. గత 19 సంవత్సరాలుగా నిరంతరం నిరుపేదలకు సేవలందిస్తూ, మా ఫౌండేషన్ నిరుపేదల పక్షపాతిగా నిలిచిందని, ఆ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
ఈనెల 29వ తేదీ వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా పదిమంది బ్రాహ్మణులకు స్వయంపాకం అందజేసి, మధ్యాహ్న భోజన వసతి కల్పించనున్నామని, అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ క్రీడాకారులకు, శాస్త్రీయ సంగీత కళాకారులకు పురస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని లీలా మోహన్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం వీ రావు ఫౌండేషన్ చైర్మన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి మరియు నిరుపేదలు పాల్గొన్నారు.







