ముండ్లమూరు, 2026-11-25
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి విలువలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్లడి దేవకుమార్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

డీబీఆర్సీ రాష్ట్ర ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ ఎం. హేమలత మాట్లాడుతూ దళితులు, ఆదివాసీలు, మహిళలు, బలహీన వర్గాలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకుని వాటిని సాధించుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించాలని, రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను పాటిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ ఆశయాల సాధనలో యువత, విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
అనంతరం 40 మంది విద్యార్థినులకు క్విజ్ పోటీలు నిర్వహించి రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీబీఆర్సీ జిల్లా కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, ఇండియా లేబర్ లైన్ ప్రతినిధి అంకం కిరణ్ కుమార్, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు పాల్గొన్నారు.