అన్నమయ్య, 2026-11-27
అన్నమయ్య జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయచోటిలోని ఏపీ మోడల్ స్కూల్లో బాల్యవివాహ ముక్త్ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయచోటిలోని ఏపీ మోడల్ స్కూల్లో బాల్యవివాహ ముక్త్ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా బాల్యవివాహాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, బాల్యవివాహాల నిషేధ చట్టం2006 ప్రాముఖ్యతను వివరించారు. బాలల హక్కులు, గుడ్ టచ్బ్యాడ్ టచ్ వంటి సున్నితమైన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, అత్యవసర సేవల నంబర్ 112 గురించి కూడా తెలియజేశారు.
గుడ్ నైబర్స్ ఎన్జీవో ప్రతినిధి నాగేశ్వర్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ చదువుపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. అనవసరమైన సోషల్ మీడియా వినియోగానికి దూరంగా ఉండటం ద్వారా విద్యార్థులు మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, రక్షణ అధికారి వెంకట రవికుమార్, ఔట్రీచ్ వర్కర్ సురేష్, పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.



