Dr. B.R. Ambedkar Konaseema/Atreyapuram (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 23
బాపట్ల జిల్లా, చీరాల శక్తి బృందం ఆధ్వర్యంలో కారంచేడు మండలం, స్వర్ణ గ్రామంలో 'శక్తి యాప్' వినియోగంపై అవగాహన కార్యక్రమం జరిగింది. మహిళల భద్రత, వేధింపుల నివారణకు ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. పోలీసు అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా, చీరాల శక్తి బృందం ఆధ్వర్యంలో స్వర్ణ గ్రామంలో 'శక్తి యాప్' వినియోగంపై అవగాహన కార్యక్రమం జరిగింది. బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎమ్.డి. మోయిన్ సూచనలతో ఇంకొల్లు సిఐ ఎం. రామనాయక్, కారంచేడు ఎస్సై ఖాదర్ బాషాల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కారంచేడు మండలం, స్వర్ణ గ్రామంలోని జిల్లలో కారంచేడు ఏఎస్ఐ ఏ. శివారెడ్డి, శక్తి టీం కానిస్టేబుల్ కె. సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ కోటి సామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కారంచేడు ఎస్సై ఖాదర్ భాషా మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మహిళలపై వేధింపులు జరగకుండా 'శక్తి యాప్' లేదా 112 ఫోన్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. బస్టాప్‌లు, హైస్కూల్ పరిసరాలు, ప్రజా ప్రదేశాలు, సామాజిక మాధ్యమాల్లో జరిగే ఈవ్‌టీజింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, వెంటపడటం, బెదిరింపులు వంటి వేధింపులను సహించకూడదని గ్రామస్తులకు తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే 'శక్తి యాప్' (SOS) ద్వారా లేదా 112 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యతను గుర్తించాలని, వేధింపులు లేని విద్యా వాతావరణాన్ని నిర్మించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, విద్యార్థినులు చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కులను తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరించారు.












