Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 12
బాపట్ల జిల్లా చీరాల మండలంలోని రామాపురం బీచ్‌లో తప్పిపోయిన ఆరేళ్ల బాలుడిని శక్తి టీమ్ సభ్యులు చాకచక్యంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాపట్ల జిల్లా IPS బి. ఉమామహేశ్వర్ గారి ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ DSP మెయిన్ గారి పర్యవేక్షణలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే బీచ్‌లో ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి కూడా పోలీసులు సహాయం అందించారు.
బాపట్ల జిల్లా చీరాల మండలంలోని రామాపురం బీచ్‌లో తప్పిపోయిన ఆరేళ్ల బాలుడిని శక్తి టీమ్ సభ్యులు చాకచక్యంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాపట్ల జిల్లా IPS బి. ఉమామహేశ్వర్ గారి ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ DSP మెయిన్ గారి పర్యవేక్షణలో శక్తి టీమ్ సభ్యులు రామాపురం బీచ్‌తో పాటు సిబ్రీజ్ బీచ్లోనూ విధుల్లో ఉన్నారు.
హైదరాబాద్‌కు చెందిన మనోజ్, సౌజన్య దంపతుల ఆరేళ్ల కుమారుడు గౌసిక్, కుటుంబ సభ్యులతో కలిసి సముద్రంలో స్నానం చేస్తుండగా తప్పిపోయాడు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెతకడం ప్రారంభించారు. ఈ విషయం అక్కడే విధుల్లో ఉన్న శక్తి టీమ్ సభ్యులైన కానిస్టేబుల్ కె. సుబ్బారావు, లేడీ కానిస్టేబుల్ సిహెచ్. సునీత దృష్టికి వెళ్ళింది.
వెంటనే స్పందించిన శక్తి టీమ్ సభ్యులు కె. సుబ్బారావు, సిహెచ్. సునీత బీచ్ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటిలోనే తప్పిపోయిన గౌసిక్ను గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తమ బిడ్డ క్షేమంగా దొరకడంతో గౌసిక్ తల్లిదండ్రులు శక్తి టీమ్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
పిల్లలతో కలిసి సముద్ర స్నానాలకు వచ్చే యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని శక్తి టీమ్ సభ్యులు సూచించారు. మరో సంఘటనలో, హైదరాబాద్‌కు చెందిన బాబు అనే వ్యక్తి, అతని స్నేహితుడు చీరాల నుంచి ఆటోలో రామాపురం బీచ్‌లోని సిబ్రిడ్జ్ వద్దకు వచ్చారు. బీచ్‌లో ఫోన్ చూసుకుంటున్నప్పుడు బాబు తన ఫోన్‌ను పోగొట్టుకున్నారు.
వారి ఫోన్ కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. ఈ సమయంలో, చీరాలకు చెందిన ఆటో డ్రైవర్ కోటేశ్వరరావు, తన ఆటోలో ఉన్న సెల్‌ఫోన్‌ను గుర్తించి, దానిని తీసుకుని సిబ్రిడ్జ్ వద్ద విధుల్లో ఉన్న శక్తి టీమ్ సభ్యులను సంప్రదించారు. ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తిని కనుగొన్న శక్తి టీమ్ సభ్యులు, ఆటో డ్రైవర్ కోటేశ్వరరావు సహాయంతో రెడ్మీ మొబైల్‌ను బాబుకు అందజేశారు.
నిజాయితీగా ఫోన్‌ను తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్ కోటేశ్వరరావుకు, శక్తి టీమ్ సభ్యులకు ఫోన్ పోగొట్టుకున్న బాబు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ఇలాగే నిజాయితీగా వ్యవహరించాలని శక్తి టీమ్ సభ్యులు సూచించారు.












