నాగలాపురం బస్టాండ్, నాగలాపురం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 07
మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తిరుపతి నుంచి సత్యవేడు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అద్దాలను నాగలాపురం బస్టాండ్‌లో ఆదివారం ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అద్దాలను ధ్వంసం చేసిన ఘటన నాగలాపురం బస్టాండ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి సత్యవేడుకు వెళ్తున్న బస్సు బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు కండక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగిన నేపథ్యంలో, ఇలాంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.








