క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
తిరుపతి నూతన మేయర్‌గా ఎన్నికైన జేబీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
తిరుపతి నూతన మేయర్ జేబీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ముందుగా ఎస్వీ యూనివర్సిటీకి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి కార్పొరేటర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం నూతన మేయర్‌గా ఎన్నికైన జేబీ శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే పులివర్తి నాని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మెరుగైన పౌర సేవలు అందించేందుకు సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలు శాఖల చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







