బద్వేలు, 2026-11-28
వైద్యుడిని సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవడం అత్యంత ప్రమాదకరమని మలేరియా సబ్ యూనిట్ అధికారి బ్రహ్మాజీ హెచ్చరించారు. బద్వేల్ మండలంలోని తిప్పనపల్లె, హరిజనవాడ గ్రామాల్లో ఇంటింటా లార్వా సర్వే నిర్వహించి, ప్రజలకు ఆరోగ్య సూచనలు అందించారు.
వైద్యుడిని సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవడం ప్రమాదకరమని మలేరియా సబ్ యూనిట్ అధికారి బ్రహ్మాజీ అన్నారు. బద్వేల్ మండలం తిప్పనపల్లె మరియు హరిజనవాడలో ఇంటింటా లార్వా సర్వే జరిగింది. ఈ సందర్భంగా సిబ్బంది ప్రజలకు శుభ్రతపై మరియు దోమల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ, వైద్య సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని, అవసరం ఉన్నచోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా అక్కడికక్కడే వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, చెడు వ్యసనాలకు గురికాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ . జనార్దన్ రావు, సిహెచ్ఓ ప్రభావతి, వైద్య సిబ్బంది మల్లీశ్వరి, జయమ్మ, ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



