పర్చూరు, 19 November
నాలుగు దశాబ్దాలుగా విద్యారంగానికి విశేష సేవలందిస్తూ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అక్షర దార్శనికుడు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కొనియాడారు. క్రౌన్ హ్యూమన్ రైట్స్ పర్చూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. విద్యారంగంలో ఉప్పలపాటి వెంకటేశ్వరరావు 40 ఏళ్లుగా అందిస్తున్న సేవలను పురస్కరించుకుని నిర్వహించనున్న రూబీ జూబ్లీ వేడుకల లోగో, ఆహ్వాన పోస్టర్ను గురువారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘనంగా ఆవిష్కరించారు. ఈ వేడుకలకు సంబంధించిన ప్రచార సామగ్రిని ఆవిష్కరించి, ఉప్పలపాటి వెంకటేశ్వరరావుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
నాలుగు దశాబ్దాలుగా విద్యను సామాజిక అభివృద్ధికి సాధనంగా మలుచుకుంటూ, ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించి వారి జీవితాల్లో ఉన్నత స్థానాలకు చేరుకునేలా మార్గదర్శకత్వం వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యారంగానికి అంకితభావంతో సేవలందిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఉప్పలపాటి వెంకటేశ్వరరావు 40 ఏళ్ల సేవా ప్రస్థానం ప్రశంసనీయమని, రూబీ జూబ్లీ వేడుకలు విజయవంతంగా జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.



