క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
ఆపద సమయాల్లో ధైర్యంగా వ్యవహరించడం, వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండటం వంటి అంశాలపై చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది.
క్రౌన్ హ్యూమన్ రైట్స్, చీరాల: విద్యార్థులు తమ వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఆపద సమయాల్లో ధైర్యంగా వ్యవహరించాలని చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం సూచించింది. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో సోమవారం చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలోని మదర్ థెరిస్సా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు స్వీయ రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆత్మరక్షణ మెలకువలు
ఈ సందర్భంగా శక్తి బృందం కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆత్మరక్షణకు సంబంధించిన పలు మెలకువలను వివరించారు. అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎలా స్పందించాలి, ప్రమాదకర పరిస్థితుల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ప్రాక్టికల్‌గా శిక్షణ ఇచ్చారు. వ్యక్తిగత భద్రత, అప్రమత్తత, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు చదువుతో పాటు స్వీయ రక్షణ పద్ధతులపై కూడా పట్టు సాధించాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందిస్తాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, సెక్రటరీ దాసరి కిషోర్ కుమార్, డైరెక్టర్ దాసరి అపర్ణాదేవి, హెడ్మాస్టర్ నూతలపాటి కృపావరం, కరాటే ఇన్చార్జి టీచర్ లీనా జెస్సికా, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







