బాపట్ల, జూన్ 1, 2026
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు ప్రభుత్వం చోటు కల్పించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు చెందిన ప్రముఖులు దొరకలేదా అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. సురేఖ నియామకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు ప్రభుత్వం చోటు కల్పించడంపై పలువురు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలోని ఈ ఆలయానికి స్థానికంగా ప్రముఖులు దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఏ అర్హతతో సురేఖకు పదవి ఇచ్చారని నిలదీస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులోనూ తెలంగాణ వాళ్లు ఉన్నారని మరికొందరు గుర్తు చేస్తున్నారు.












