ఉదయగిరి, 26 September
పల్లె పండుగ3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పర్చూరు ఎమ్మెల్యే, ఉదయగిరి నియోజకవర్గ అబ్జర్వర్ ఏలూరి సాంబశివరావు సూచించారు. ఈ నెల 29న ఉదయగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొననున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమంపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ కార్యక్రమ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పార్కింగ్, రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యేలా స్థానిక నాయకులు సమన్వయం చేసుకోవాలని కోరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు ఏలూరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలు, భద్రత, తాగునీటి ఏర్పాట్లను ఏలూరి పరిశీలించారు. నిర్దేశిత సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నాయకులు, అధికారులకు సూచించారు.