నాయకత్వంలో (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 08
వేటపాలెం మండల జడ్పీటీసీ ఎన్నికల్లో శాసనసభ్యులు ఎం.ఎం.
వేటపాలెం మండల జడ్పీటీసీ ఎన్నికల్లో శాసనసభ్యులు ఎం.ఎం. కొండయ్య అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నాసిక వీరభద్రయ్యను ఆదివారం సాయంత్రం పలువురు ప్రముఖులు కలిసి మర్యాదపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రముఖ సైంటిస్ట్ అందే మురళి కలాం వరప్రసాద్, రిటైర్డ్ ఉపాధ్యాయులు బట్ట మోహన్ రావు, తెలుగు రైతు విభాగం అధ్యక్షులు పోలకం చంద్రశేఖర్ నాసిక వీరభద్రయ్యను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు. జడ్పీటీసీగా విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఉన్న అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధంతో వేటపాలెం మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య మండలంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యతనిస్తూ వేటపాలెం మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు.









